Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెల్జియం భామతో సిక్కోలు యువకుడి వివాహం

Belgian woman Camille Mascare marries Sriranganath Sahit in Indian ceremony
Advertisement



Advertisement
శ్రీకాకుళంలో శనివారం బెల్జియం అమ్మాయి సిక్కోలు యువకుడిని వివాహం చేసుకుంది. రెండు భిన్న సంస్కృతులకు చెందిన వధూవరులు భారత సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. బెల్జియం యువతి కెమిలీ మస్కర్‌ మెడలో శ్రీకాకుళానికి చెందిన శ్రీరంగనాథ్‌ సాహిత్‌ తాళి కట్టారు. ఈ వేడుకకు బెల్జియం నుంచి కెమిలీ తల్లిదండ్రులు, బంధువులు హాజరై భారతీయ వస్త్రధారణతో సందడి చేశారు.

శ్రీరంగనాథ్ సాహిత్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా లండన్ లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ తనతో పాటే పనిచేస్తున్న కెమిలీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఈ జంట ఒక్కటైంది. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కెమిలీ బంధుమిత్రులు వివాహ వేడుకకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.
Advertisement
Advertisement
Intercultural marriage
Sriranganath Sahit
Belgium
Srikakulam
Software Engineer
Love marriage
Indian wedding
Camille Mascare

More Telugu News